Anandi: తల్లికాబోతున్న హీరోయిన్ ఆనంది

Actress Anandi is pregnant

  • హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఆనంది
  • జనవరి 1న అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో వివాహం
  • 'శ్రీదేవి సోడా సెంటర్'లో నటించిన ఆనంది

తెలుగమ్మాయి ఆనంది మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మంచి హీరోయిన్ గా పేరు పొందింది. తొలినాళ్లలో 'బస్ స్టాప్', 'ఈ రోజుల్లో' వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. దీంతో, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది.

ఇదే సమయంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో వరంగల్లో సోక్రటీస్ తో వివాహం జరిగింది.  త్వరలోనే ఆమె తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఆరో నెల అని తెలుస్తోంది.  
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆనంది నటించిన రెండు తెలుగు సినిమాలు ఆమె పెళ్లి తర్వాత విడుదలయ్యాయి. వాటిలో ఒకటి 'జాంబిరెడ్డి' కాగా... మరొకటి 'శ్రీదేవి సోడా సెంటర్'.

Anandi
Tollywood
Pregnant
  • Loading...

More Telugu News