Chandrababu: చింతమనేని ప్రభాకర్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

Chandrababu phone call to Chintamaneni Prabhakar
  • చింతమనేని నిన్న అరెస్ట్, నేడు విడుదల
  • నోటీసులు ఇచ్చి విడిచిపెట్టిన పోలీసులు
  • అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలుసుకున్న చంద్రబాబు
  • అండగా ఉంటామని భరోసా
దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు స్పందించారు. చింతమనేని ప్రభాకర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అరెస్ట్, విడుదల తదితర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, అక్రమ కేసులతో తమ పార్టీ నేతల గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతమనేనికి అండగా ఉంటామని తెలిపారు. అంతకుముందు, చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఇదే అంశంపై లేఖ రాశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Chinthamaneni Prabhakar
Phone
Arrest
Release
Police
TDP
Andhra Pradesh

More Telugu News