Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Trisha to be cast opposite Balakrishna
  • బాలకృష్ణ భార్య పాత్రలో త్రిష
  • చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో గద్దర్
  • 'బంగార్రాజు'లో మరో ఇద్దరు భామలు  
*  అందాలతార త్రిష నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన కథానాయికగా నటించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందే చిత్రంలో త్రిష ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తుందట.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరిట రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ప్రజాగాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే షెడ్యూలులో ఈ పాత్రకు సంబంధించిన దృశ్యాలను విశాఖ సెంట్రల్ జైలులో చిత్రీకరిస్తారట.
*  నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఇప్పటికే ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా ఎంపిక కాగా.. తాజాగా మరో ఇద్దరు భామలను కూడా తీసుకున్నారు. దర్శన, అక్షిత సోనావానే లను తాజాగా కీలక పాత్రలకు తీసుకున్నట్టు సమాచారం.
Trisha
Balakrishna
Gaddar
Chiranjeevi
Nagarjuna

More Telugu News