Venkaiah Naidu: మన భాషను కాపాడుకుని, ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి: వెంక‌య్య నాయుడు

venkaiah wishes on telugu language day
  • తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్ష‌లు
  • ప్రజలకు అర్థ‌మయ్యే భాషలో ఉన్న విజ్ఞానమే సమాజానికి మేలు చేస్తుంది
  • ఈ విష‌యాన్ని నమ్మారు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు
  • మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి భాష
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. 'ప్రజలకు అర్థ‌మయ్యే భాషలో ఉన్న విజ్ఞానమే సమాజానికి మేలు చేస్తుందని నమ్మి, వాడుక భాష ఉద్యమానికి శ్రీకారం చుట్టిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మన భాషను కాపాడుకుని, ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి' అని అన్నారు.

'తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. భాష అంటే మాటల వారధి మాత్రమే కాదు. మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారధి కూడా. తెలుగు భాషను నేర్చుకోవడం, తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని తెలుగు వారంతా తమ బాధ్యతగా గుర్తెరగాలని ఆకాంక్షిస్తున్నాను' అని వెంక‌య్య నాయుడు ట్వీట్లు చేశారు. కాగా, తెలుగు భాష దినోత్స‌వ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతూ మాతృభాష గొప్ప‌ద‌నాన్ని వివ‌రిస్తున్నారు.
Venkaiah Naidu
India
telugu

More Telugu News