Biswabhusan Harichandan: జగన్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ap governor wishes cm ys jagan and bharati reddy
  • 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సీఏం దంపతులు
  • ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్
  • జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులుండాలంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు.  

శనివారం ఉదయం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే వైఎస్‌ జగన్‌ దంపతులపై ఆ జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. అంతేకాకుండా జగన్ దంపతులు పూర్తి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవితం గడపాలని ఆశీర్వదించారు.
Biswabhusan Harichandan
Jagan
bharati reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News