Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anasuya to play Manju Warrior role in God Father
  • మెగాస్టార్ సినిమాలో అనసూయ కీలకపాత్ర 
  • ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగుతున్న అనిరుధ్
  • శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' విడుదల వాయిదా    
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చిత్రం రూపొందుతోంది. మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి ఇది రీమేక్. ఇక లూసిఫర్ లో మంజు వరియర్ పోషించిన కీలక పాత్రలో అనసూయ నటించనున్నట్టు సమాచారం. చాలామందిని పరిశీలించిన పిమ్మట అనసూయను ఈ పాత్రకు ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
*  'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తాడని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి మ్యూజిక్ సిటింగ్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  నాగ చైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' చిత్రం విడుదల వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల అవ్వాల్సివుంది. అయితే, కారణాంతరాల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నారట.
Anasuya
Chiranjeevi
Jr NTR
Aniruth
Sai Pallavi

More Telugu News