Rohit Sharma: హెడింగ్లే టెస్టులో రోహిత్, పుజారా అర్ధసెంచరీలు

Fifties for Rohit Sharma and Pujara in Headingley
  • రెండో ఇన్నింగ్స్ లో కుదురుగా ఆడుతున్న భారత్ 
  • 60 ఓవర్ల అనంతరం 2 వికెట్లకు 162 రన్స్
  • ఇంకా 192 రన్స్ వెనుకబడి ఉన్న వైనం
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 432 ఆలౌట్
  • ఆతిథ్య జట్టుకు 354 పరుగుల ఆధిక్యం
ఇంగ్లండ్ తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అత్యంత పేలవంగా ఆడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో గాడినపడినట్టే కనిపిస్తోంది. 60 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 162 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 59 పరుగులు చేసి, రాబిన్సన్ బౌలింగ్ లో అవుట్ కాగా, పుజారా 71 పరుగులతో ఆడుతున్నాడు. పుజారాకు జతగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అంతకుముందు, ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. రాహుల్ 8 పరుగులు చేసి ఒవెర్టన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 432 పరుగులకు ఆలౌట్ కాగా, 354 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఇంకా 192 పరుగులు వెనుకబడి ఉంది.
Rohit Sharma
Cheteshwar Pujara
Fifty
Team India
England
Headingley

More Telugu News