Allu Arjun: 'పుష్ప' నుంచి రానున్న విలన్ ఫస్టులుక్!

Villain firstlook to release tomorrow

  • ముగింపు దశలో 'పుష్ప'
  • పవర్ఫుల్ విలన్ గా ఫాహద్ ఫాజిల్ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • 'క్రిస్మస్'కి సినిమా విడుదల

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. టీజర్ .. ట్రైలర్ లకు .. ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ప్రతి అప్డేట్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమా షూటింగులో కాస్త ఆలస్యంగానే జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫాహద్ ఫాజిల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. 'ఇంతటి ప్రమాదకరమైన కేరెక్టర్ ను మీరు ఇంతవరకూ చూసుండరు' అంటూ ప్రతినాయకుడి పాత్ర స్వభావం గురించి చెప్పుకొచ్చారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కానుకగా విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News