Andhra Pradesh: మళ్లీ రంజుగా తాడిపత్రి రాజకీయాలు!

Tadipatri Politics Again Going To Heat Up

  • ఇవాళ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
  • కౌన్సిలర్లను క్యాంప్ నకు తరలించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • సైలెంట్ గా ఉన్న పెద్దారెడ్డి వర్గం
  • టీడీపీ బలం 20.. వైసీపీకి 18

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మరక ఇప్పటికీ పోలేదు. తాడిపత్రి చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాడివేడిగా సాగాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వచ్చేసింది. దీంతో అక్కడి జనాలు దీనిపైనే చర్చించుకుంటున్నారు.

ఆ రెండు పోస్టులు ఈసారి జేసీ వర్గానికే వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, ముందు జాగ్రత్తగా ఇవాళ జరగనున్న కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో తమ కౌన్సిలర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ నకు తరలించారు. ఇటు పెద్దా రెడ్డి మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు. ప్రజల నిర్ణయాన్ని ఒప్పుకోవాలని సీఎం జగన్ సూచించాకే.. ఎమ్మెల్యే వర్గం సైలెంట్ అయిందని చెబుతున్నారు.

ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి 18 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 16 మంది కౌన్సిలర్లున్నారు. ఒక సీపీఐ కౌన్సిలర్ కాగా.. మరొకరు స్వతంత్ర అభ్యర్థి. వారిద్దరూ టీడీపీకే మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలం 20కి పెరిగింది. వైసీపీకి ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కలిపినా బలం 18గా ఉంది. దీంతో ఆ రెండు కో ఆప్షన్ పదవులు దాదాపు టీడీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

  • Loading...

More Telugu News