Anantapur District: అనంతపురం కలెక్టరేట్ లో తప్పిన పెనుప్రమాదం
- బ్రిటీష్ కాలం నాటి భవనం కావడంతో మరమ్మతులు
- భవనంలోని ఓ గది పైకప్పు కూలిపోయిన వైనం
- ఘటన సమయంలో కొత్తచెరువు మండలంలో పర్యటిస్తున్న కలెక్టర్
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ కార్యాలయంలోని ఓ గది పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనతో కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది అందరూ షాక్ కు గురయ్యారు. అయితే, ప్రమాద సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ కార్యాలయం బ్రిటీష్ కాలం నాటిది కావడంతో మరమ్మతు పనులు చేపట్టారు. పనులు కొనసాగుతున్న సమయంలోనే పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో జిల్లా కలెక్టర్ కొత్తచెరువు మండలంలో పర్యటిస్తున్నారు. ఈ ప్రమాదంపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు.