CPI Ramakrishna: జగన్‌కు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna writes letter to Jagan
  • హంద్రీనీవాలో నీరు  పుష్కలంగా ఉంది
  • అయినా పూర్తి నీరు ప్రజలకు అందుబాటులోకి రాలేదు
  • తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరో లేఖ రాశారు. హంద్రీనీవా కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ... పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రాలేదని లేఖలో ఆయన తెలిపారు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులు నింపవచ్చని, దాదాపు 10వేల ఎకరాలకు పైగా సాగునీటిని అందించవచ్చని, 150 గ్రామాలకు తాగునీటి ఇబ్బందిని తొలగించవచ్చని చెప్పారు. హంద్రీనీవా పనులకు పూర్తి నిధులను కేటాయించినప్పటికీ... ఇప్పటి వరకు సగం నిధులను మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని... చెరువులన్నింటినీ నింపి... తాగునీరు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna
Andhra Pradesh
Jagan
YSRCP
Letter

More Telugu News