Komatireddy Venkat Reddy: తక్షణమే గిరిజన బంధు కూడా ఇవ్వాలి: కోమటిరెడ్డి

Komatireddy demands for Girijana Bandhu
  • రాహుల్ బొజ్జాకు సీఎంవో చోటు ఇవ్వగానే దళితులందరికీ ఇచ్చినట్టేనా?
  • ఉద్యోగులకు జీతాలివ్వలేక భూములమ్మిన బ్రోకర్ కేసీఆర్
  • మంత్రివర్గంలో దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును ప్రకటించినప్పటి నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ గిరిజన బంధును కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా రాంపూర్ తాండాలో జరిగిన దళిత, గిరిజన దండోరా దీక్షలో కోమటిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో లేక ఇతర బలహీనవర్గాలకు చెందిన వ్యక్తో సీఎం అవుతారని చెప్పారు. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు సీఎంవోలో చోటు ఇవ్వగానే దళితులందరికీ ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు.

భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే... ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని కోమటిరెడ్డి అన్నారు. మీ కూతురు కవితకు టికెట్ ఇచ్చినా తాను ఆమెను గెలిపిస్తానని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కోకాపేట భూములు అమ్మిన బ్రోకర్ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమలకు స్థానం కల్పించిన కేసీఆర్.. దళితులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Komatireddy Venkat Reddy
Congress
Girijana Bandhu
KCR
TRS

More Telugu News