Avika Gor: 'నెట్' వెబ్ సిరీస్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

NET web series trailer released

  • జీ 5 నుంచి 'నెట్' వెబ్ సిరీస్
  • వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ప్రధానమైన పాత్రలో అవికా గోర్ 
  • కీలక పాత్రలో రాహుల్ రామకృష్ణ  

అవికా గోర్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా 'నెట్' వెబ్ సిరీస్ రూపొందింది. జీ 5 వారు ఈ ఒరిజినల్ సిరీస్ ను 'వినాయక చవితి' కానుకగా, వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నుంచి సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అవికా గోర్ తన బోయ్ ఫ్రెండ్ ను రహస్యంగా కలుస్తూ ఉంటుంది. ఆమె జీవితాన్ని సీక్రెట్ కెమెరా ద్వారా రాహుల్ రామకృష్ణ గమనిస్తూ ఉంటాడు. ఆయన దృష్టి మొత్తం కూడా అవికా పైనే ఉంటుంది. అందువలన భార్య దగ్గర చీకాకు పడుతూ ఉంటాడు. దాంతో ఆమెకి అనుమానం మొదలవుతుంది.

అయితే రాహుల్ రామకృష్ణ తరచూ పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ ఉంటాడు. ఎందుకోసం చేస్తున్నాడనేది స్నేహితులకు కూడా అర్థం కాదు. బోయ్ ఫ్రెండ్ తో అవికాకు గొడవ మొదలైనప్పుడే, రాహుల్ కి భార్యతో తగవు మొదలవుతుంది. ఆ తరువాత జరిగేదేమిటనేది సస్పెన్స్. చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ గా ఉండేలానే అనిపిస్తోంది.


  • Error fetching data: Network response was not ok

More Telugu News