Pavan kalyan: పవన్ కల్యాణ్ సరసన పూజ హెగ్డే?

Harish Shankar movie update

  • అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాథం'
  • చరణ్ జోడీగా చేసిన 'ఆచార్య'
  • పవన్ సరసన నాయికగా తెరపైకి 
  • త్వరలో రానున్న ప్రకటన

టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే ముందుగా పూజ హెగ్డే పేరే వినిపిస్తుంది. ఆమె అందుకున్న విజయాలు అలాంటివి .. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు అలాంటివి. నాజూకుదనానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపించే ఆమెను, పవన్ సరసన నాయికగా ఎంపిక చేసినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

పవన్ కల్యాణ్ .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నాడు. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి హిట్ ఇచ్చిన కారణంగా ఆయనతో సినిమా చేయడానికి పవన్ అంగీకరించాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు పూజ హెగ్డే కెరియర్ ఊపందుకున్నదే హరీశ్ చేసిన 'దువ్వాడ జగన్నాథం'తో అనే విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ .. చరణ్ జోడీగా చేసిన ఈ సుందరి ఏకంగా పవన్ సరసన నాయికగా ఛాన్స్ కొట్టేయడం విశేషం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ .. ఇటు 'భీమ్లా నాయక్' .. అటు 'హరి హర వీరమల్లు' సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే హరీశ్ శంకర్ సినిమా షూటింగు కూడా మొదలుకానుంది. పవన్ బర్త్ డే కానుకగా టైటిల్ ను ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Pavan kalyan
Pooja Hegde
Harish Shankar
  • Loading...

More Telugu News