Bigg Boss-5: సెప్టెంబరు 5 నుంచి తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో కొత్త సీజన్

Bigg Boss new season all set for start

  • ప్రోమో రిలీజ్ చేసిన స్టార్ మా చానల్
  • సెప్టెంబరు 5 సాయంత్రం 6 గంటలకు ఓపెనింగ్ ఎపిసోడ్
  • విసుగుకు గుడ్ బై చెప్పేయండన్న హోస్ట్ నాగార్జున
  • కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొన్ని పేర్లు వైరల్

ప్రేక్షకులను విశేషంగా అలరించే కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో మళ్లీ వచ్చేస్తోంది. బిగ్ బాస్ ఐదో సీజన్ కు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 5వ తేదీన తెలుగు బిగ్ బాస్-5 ప్రారంభం కానుంది. ఈ రియాల్టీ షో ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. విసుగుకు వీడ్కోలు చెప్పేయండి... బిగ్ బాస్ వచ్చేస్తోంది అంటూ నాగ్ తాజా ప్రోమో వీడియోలో చెప్పడం చూడొచ్చు.

బిగ్ బాస్ ఐదో సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ సెప్టెంబరు 5న సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఆపై సోమవారం నుంచి శుక్రవారం వరకు 10 గంటల నుంచి.... శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుంచి ప్రసారం అవుతుందని స్టార్ మా వెల్లడించింది.

ఎప్పట్లాగానే ఈసారి కూడా కంటెస్టెంట్ల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం.... యాంకర్ వర్షిణి, టీవీ తారలు నవ్య, లహరి, కార్తీకదీపం సీరియల్ భాగ్య, ప్రముఖ యాంకర్ రవి, ఆట కొరియోగ్రాఫర్ సందీప్ అర్ధాంగి జ్యోతి, యానీ మాస్టర్, యూట్యూబర్లు షణ్ముఖ్ జశ్వంత్, నిఖిల్, నటి ప్రియ, ఆర్జే కాజల్, లోబో, వీజే సన్నీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా తెలియాలంటే బిగ్ బాస్-5 ఓపెనింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss-5
New Season
Promo
Nagarjuna
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News