Mysuru: మైసూరులో దారుణం.. యువకుడిపై దాడిచేసి యువతిపై దోపిడీ దొంగల అత్యాచారం

Student Gang Raped  Boyfriend Attacked Near Mysuru
  • చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లిన యువతీయువకులు 
  • డబ్బుల కోసం బెదిరింపు.. ఇవ్వకపోయేసరికి అఘాయిత్యం
  • నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించామన్న ముఖ్యమంత్రి
మైసూరులో దారుణం జరిగింది. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి స్నేహితుడితో కలిసి వెళ్లిన యువతిపై దోపిడీ దొంగలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలయ సమీపంలోనే వారిని చుట్టుముట్టిన దొంగలు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. వారు ఇవ్వకపోవడంతో రెచ్చిపోయిన ఇద్దరు దొంగలు యువకుడిపై దాడిచేసి, యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.  

ప్రస్తుతం బాధితురాలు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు. అత్యాచార ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. యువతి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు కోసం బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాన్ని మైసూరు పంపినట్టు హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర తెలిపారు.
Mysuru
Gang Rape
Student
Karnataka

More Telugu News