Mallareddy: రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy counters Revanth Reddy challengeq

  • సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏదన్న రేవంత్
  • అభివృద్ధి చూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • తన సవాల్ కు స్పందన లేదన్న రేవంత్
  • తాను రాజీనామా చేసి వస్తానంటూ మల్లారెడ్డి స్పందన

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ రేవంత్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. 24 గంటలు గడిచినా తన సవాల్ కు అధికారపక్షం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి మరీ స్పందించారు. తాను రాజీనామా చేసి వస్తానని, రేవంత్ కూడా రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు. గెలిచినవాడు హీరో, ఓడినవాడు జీరో అని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News