Taliban: పంజ్​ షీర్​ తిరుగుబాటు దళాలతో తాలిబన్ల చర్చలు

Talibans Negotiating Panjshir Resistance Forces

  • సమావేశమైన 40 మంది తాలిబన్ నేతలు
  • ఇంకా తేలని చర్చల ఫలితం
  • అంజుమాన్ పాస్ నుంచి చొరబాటుకు తాలిబన్ల యత్నం
  • తిప్పికొట్టామన్న పంజ్ షీర్ బలగాలు

పంజ్ షీర్ తిరుగుబాటు దళాలతో తాలిబన్లు చర్చలు జరుపుతున్నారు. 40 మందితో కూడిన తాలిబన్ల బృందం వారితో సమావేశమైంది. అయితే, చర్చల ఫలితం ఏంటన్నది ఇంకా తేలలేదు. అయితే, తాలిబన్ల ముందు రెండే రెండు మార్గాలున్నాయని పంజ్ షీర్ తిరుగుబాటు దళాలు పేర్కొంటున్నాయి. ఖొరాసన్ ప్రజల విలువలను తాలిబన్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అన్న రెండు ఆప్షన్లే వారికి ఉన్నాయని ట్వీట్ చేసింది.

అయితే, ఇప్పటికే పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉన్నాయని తనను తాను ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ చెబుతున్నారు.

నిన్న తాలిబన్లు బదక్షిణ్ ప్రావిన్స్ కు ఆనుకుని ఉన్న అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ చెప్పారు. తాలిబన్లతో జరిగిన హోరాహోరీ పోరులో చాలా మంది చనిపోయారని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటిదాకా తాలిబన్ల అధీనంలోలేని ఏకైక ప్రావిన్స్ పంజ్ షీర్ కావడం విశేషం. ఇప్పుడు దానినీ చర్చల ద్వారా వారు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Taliban
Afghanistan
Panjshir
Resistance Forces
  • Loading...

More Telugu News