Intelligence: తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్

ADGP Anil Kumar appointed As Intelligence Chief

  • ప్రభుత్వం నిన్న ఆకస్మిక ఉత్తర్వులు
  • ఎస్ఐబీ చీఫ్‌గానే పరిమితం కానున్న ప్రభాకర్‌రావు
  • ఇప్పటి వరకు రెండు విభాగాలకు పనిచేసిన ప్రభాకర్‌రావు

అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 14 నెలల క్రితం ఐజీ హోదాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) విభాగాధిపతిగా నియమితులైన ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందారు.

అయితే, ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లు పొడిగించి ఓఎస్డీగా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే నిఘా విభాగం చీఫ్ నవీన్‌చంద్ పదవీ విరమణ చేయడంతో ప్రభాకర్‌రావుకు ఇంటెలిజెన్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏడాదిపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, ఎస్ఐబీ చీఫ్‌గానూ కొనసాగారు. అయితే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్‌కుమార్‌ను నియమించడంతో ప్రభాకర్‌రావు ఎస్ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగుతారు.

Intelligence
Telangana
SIB
ADGP
AnilKumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News