Suryapet District: సూర్యాపేట జిల్లాలో కాకినాడ వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

road accident in suryapet dist akupamula 11 hurt
  • సూర్యాపేట జిల్లా ఆకుపాముల సమీపంలో ఘటన
  • కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు 
  • అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయ రహదారిపై ఈ ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా, బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. అద్దాలు పగలకొట్టుకుని బయటకు వచ్చిన కొందరు ప్రయాణికులు బస్సులో చిక్కుకున్న మిగతా వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suryapet District
Akupamula
Road Accident
Sri Krishna Travels

More Telugu News