KTR: అందాల వీక్షణకు అవకాశం.. ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions on Tank bund every sunday

  • నెటిజన్ సూచనపై  స్పందించిన కేటీఆర్
  • పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఆదేశాలు
  • సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అందాల వీక్షణ ఇక మరింత ఆనందాన్ని పంచనుంది. ఆదివారాల్లో సాయంత్రం వేళ అలా ట్యాంక్ బండ్‌కు వెళ్లి హాయిగా కాసేపు తిరిగి రావొచ్చు. ట్రాఫిక్ రణగొణధ్వనులు లేకుండా కాసేపు ప్రశాంతంగా గడపొచ్చు. ఇందుకోసం ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. వచ్చే వారం నుంచే ఇది అమలు కానుంది.

 ట్యాంక్ బండ్ అందాలను వీక్షించేందుకు అనువుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న ఓ నెటిజన్ అభ్యర్థనకు స్పందించిన మంత్రి కేటీఆర్.. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను ఈ మేరకు సూచించారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ మళ్లించాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయంతో ట్యాంక్ బండ్ వీక్షణకు మరింతమంది సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు.

KTR
Netizen
Tank Bund
Hussain Sagar
Hyderabad
  • Loading...

More Telugu News