YS Jagan: వైఎస్ జగన్ బెయిలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై నేడు తీర్పు.. సర్వత్ర టెన్షన్!

CBI Court Verdict today on ys jagan bail pettition

  • జగన్ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామరాజు పిటిషన్
  • బెయిలు షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ
  • బెయిలు రద్దు చేసి కేసులను త్వరితగతిన విచారించాలని అభ్యర్థన
  • జులైలోనే పూర్తయిన వాదనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. సీఎం జగన్ బెయిలు రద్దు చేసి ఆయనపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు. వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులైలోనే వాదనలు పూర్తి కాగా తీర్పును సీబీఐ కోర్టు నేటికి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని అటు వైసీపీ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

YS Jagan
Vijayasai Reddy
CBI Court
Bail
Raghu Rama Krishna Raju
Andhra Pradesh
  • Loading...

More Telugu News