Corona Vaccination: ఇక వాట్సాప్ లోనూ కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్

Corona Vaccination slat booking now on Whatsapp

  • ఇప్పటివరకు కొవిన్ ద్వారా రిజిస్ట్రేషన్
  • వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నేరుగానూ టీకా పొందే అవకాశం
  • తాజాగా వాట్సాప్ నెంబరు తీసుకువచ్చిన కేంద్రం
  • "బుక్ స్లాట్" అని సందేశం పంపితే టీకా పొందే అవకాశం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఇకపై వాట్సాప్ లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది.

వాట్సాప్ లోనూ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు 90131 51515 నెంబరుకు "బుక్ స్లాట్" అని సందేశం పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Corona Vaccination
Slat Booking
Whatsapp
Cowin
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News