Thadepalli: సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహం తొలగింపు

Bharat Mata staue near Jagans residence removed

  • తాడేపల్లిలో విగ్రహాన్ని తొలగించిన అధికారులు
  • సీఎం భద్రత పేరుతో విగ్రహం తొలగింపు
  • రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామన్న అధికారులు  

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రి ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని నిన్న రాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.

బకింగ్ హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డును విస్తరించాలని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్పారు. 15 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

Thadepalli
Bharat Matha Statue
Removed
Jagan
  • Loading...

More Telugu News