Manmohan: విష సర్పాలకు రాఖీ కట్టే ప్రయత్నంలో ప్రాణాలు పోయాయి... వీడియో ఇదిగో!

Man lost his life while tying rakhi to snakes

  • రాఖీ పండుగ నాడు విషాదం
  • బీహార్ లో పాములకు రాఖీ కట్టబోయిన వ్యక్తి
  • కాలిపై కాటేసిన ఓ పాము
  • వైద్యసాయం తీసుకోవడంలో నిర్లక్ష్యం

ఎవరూ చేయని పని చేయాలనుకున్నాడు... కాలనాగులకు రాఖీ కట్టాలని భావించి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. అతడి పేరు మన్మోహన్. బీహార్ లోని సరన్ జిల్లా మాంజీ సీతల్ పూర్ అతడి స్వగ్రామం. పాములు పట్టడంలోనూ, పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయడంలోనూ మన్మోహన్ ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడు.

నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు నాగుపాములు తీసుకువచ్చాడు. వాటికి రాఖీలు కట్టేందుకు ప్రయత్నించాడు. అతడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఓ సర్పం అతడి కాలిపై కాటేసింది. అయితే, వైద్యం సాయం తీసుకునేలోపే అతని ప్రాణాలు పోయాయి. అతడిని పాము కరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. మన్మోహన్ మృతితో అతడి స్వగ్రామంలో విషాదం అలముకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News