Vote for Note Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- సుప్రీంలో రేవంత్, సండ్ర పిటిషన్లు
- కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ పిటిషన్
- కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ సండ్ర పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో సండ్ర పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్లపై ఎల్లుండి విచారణ జరుపుతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం తెలిపింది. మరోవైపు, ఇదే విషయమై సండ్ర వేసిన పిటిషన్ ను గత ఏడాది తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు.