Urine: ఈ వీడియో చూస్తే జీవితంలో పానీపూరీ తినలేరు!

Pani puri seller mixed urine in masala water

  • మూత్రాన్ని పానీలో కలిపిన పానీపూరీవాలా
  • సైలెంట్ గా వీడియో తీసిన ఒక వ్యక్తి
  • పానీపూరీవాలాను అరెస్ట్ చేసిన పోలీసులు

పానీపూరీ... ఎంతో మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. ఎంతో ఇష్టంగా దీన్ని లాగించేస్తుంటారు. సాయంత్రపు వేళల్లో ఈ బండ్ల వద్ద ఎంతో హడావుడి ఉంటుంది. పానీపూరీల్లో ఉపయోగించే పానీ (మసాలా నీరు) జనాల నోళ్లూరేలా చేస్తుంటుంది. అయితే, పానీ పూరీ చేసేవాళ్ల శుభ్రత పట్ల ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో జనాలకు ఒళ్లు జలదరించేలా చేస్తోంది. అసోంలోని గౌహతిలో ఈ ఘటన చేసుకుంది.

పానీపూరీ అమ్మే ఒక వ్యక్తి తన మూత్రాన్ని ఒక మగ్గులో పట్టి మసాలా నీటిలో కలిపేశాడు. తనను ఎవరూ చూడటం లేదని అతను అనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం సైలెంట్ గా ఈ ఘటనను తన ఫోన్ లో బంధించాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన మూత్రాన్ని పానీలో కలపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తున్నవారంతా పానీపూరీ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News