Shamirpet: శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడుస్తున్న ప్రమాద దృశ్యాలు

Road accident in shamirpet one dead

  • నిర్లక్ష్యంగా రోడ్డు దాటేందుకు యత్నం
  • వేగంగా వచ్చి ఢీకొట్టిన మరో బైక్
  • అల్లంత దూరం ఎగిరిపడిన వైనం

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఓ ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యం, మరొకరి అతి వేగం కలిసి ఇంకొకరి మరణానికి కారణమయ్యాయి. ఓ మహిళతో బైక్‌పై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాహనాలను గమనించకుండానే ఉన్నట్టుండి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో బైక్ పై అత్యంత వేగంగా వస్తున్న మరో వ్యక్తి నియంత్రించుకునే సమయం లేక ఆ బైక్‌ను ఢీకొట్టాడు. ఆ వేగానికి బైక్‌లు నుజ్జు నుజ్జు కాగా, ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News