Akira: "ఉండిపోరాదే" అంటూ ఉత్తేజ్ కుమార్తె గానం.. పియానోపై అకీరా సంగీతం... వైరల్ అవుతున్న వీడియో

Akira performs in Piano as Uttej daughter sang Undiporade

  • రేణూ దేశాయ్ నివాసానికి వెళ్లిన ఉత్తేజ్ ఫ్యామిలీ
  • టాలీవుడ్ హిట్ పాటను ఆలపించిన ఉత్తేజ్ కుమార్తె
  • పియానోపై సంగీతం పలికించిన అకీరా
  • ఫ్యాన్స్ ను అలరించిన అకీరా పెర్ఫార్మెన్స్

ఇటీవల నటుడు ఉత్తేజ్ కుటుంబం రేణూ దేశాయ్ నివాసానికి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తేజ్ కుమార్తె ఉండిపోరాదే అంటూ టాలీవుడ్ హిట్ గీతాన్ని ఆలపించగా, పవన్-రేణూదేశాయ్ ల కుమారుడు అకీరానందన్ పియానోపై సంగీతం అందించారు. దాదాపుగా అపస్వరాలు పలకుండా అకీరా పియానోపై రాగాలు పలికించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోలో అకీరా మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ కు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇటీవలే అకీరా కర్రసాము వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజా వీడియోలో ఉత్తేజ్ కుమార్తె ఉండిపోరాదే పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించగా, అందుకు దీటుగా అకీరా పియానోపై సంగీతాన్ని పలికించడం పవన్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News