Seethakka: చంద్రబాబుతో పాటు దేవాన్ష్ కు కూడా రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka ties rakhy to Chandrababu

  • నేడు రాఖీ పండుగ
  • చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీతక్క, పరిటాల సునీత
  • రాఖీ కట్టి పాదాలకు నమస్కారం
  • ఆశీస్సులు అందించిన చంద్రబాబు

ఇవాళ రాఖీ పండుగ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను సోదరుడిగా భావించే చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆపై ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడే ఉన్న తన మనవడు దేవాన్ష్ కు సీతక్కను పరిచయం చేశారు. దాంతో సీతక్క చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి దేవాన్ష్ కు కూడా రాఖీ కట్టారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత కూడా తమ పార్టీ అధినేతకు రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు.

ఇటీవల సీతక్క తల్లి సమ్మక్క ఆరోగ్య బాగాలేక హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరగా, చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించడమే కాకుండా, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలంటూ అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. సీతక్కకు ధైర్యం చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News