Nagachaitanya: 'నాంది' దర్శకుడితో నాగచైతన్య?

Naga Chaitanya in Vijay Kanakamedala movie

  • రిలీజ్ కి రెడీగా 'లవ్ స్టోరీ'
  • షూటింగు దశలో 'థ్యాంక్యూ'
  • విజయ్ కనకమేడల కథకి ఓకే
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్

నాగచైతన్య హీరోగా తన దూకుడు చూపిస్తున్నాడు. సైలెంట్ గా వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అలా అని చెప్పి వచ్చిన ప్రతి ప్రాజెక్టును ఆయన ఒప్పుకోవడం లేదు. కథలో వైవిధ్యం .. తన పాత్రలో కొత్తదనం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలాగే తనని మరింత డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే దర్శకులకు మాత్రమే ఓకే చెబుతున్నాడు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లవ్ స్టోరీ' సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి జోడీగా ఆయన చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థ్యాంక్యూ' సినిమా కూడా ముగింపు దశలోనే ఉంది.

ఇక తాజాగా చైతూకి 'నాంది' దర్శకుడు విజయ్ కనకమేడల ఒక కథను వినిపించాడట. ఈ కథ చాలా కొత్తగా ఉందనీ ..  సమంతకు కూడా బాగా నచ్చిందనీ చెబుతున్నారు. అందువలన వెంటనే ఓకే చెప్పేయడం జరిగిందని  అంటున్నారు. 'నాంది' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఆయన టాలెంట్ పై నమ్మకంతోనే ఈ  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.  

Nagachaitanya
Vijay Kanakamedala
Samantha
  • Loading...

More Telugu News