G. Kishan Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి.. నేడు హైదరాబాద్‌లో జన ఆశీర్వాద యాత్ర

union minister kishan reddy visits yadadri temple
  • మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు
  • ఉప్పల్‌లో కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకనున్న బీజేపీ శ్రేణులు
  • సికింద్రాబాద్ పరిధిలో 50 కిలోమీటర్ల మేర యాత్ర
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం కొండపై పునర్నిర్మిస్తున్న ప్రధాన ఆలయ పనులను పరిశీలించారు.

కాగా, జన ఆశీర్వాద యాత్రలతో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న యాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉప్పల్ రింగురోడ్డుకు చేరుకోనున్న మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద జరగనున్న బహిరంగ సభలో కిషన్‌రెడ్డి పాల్గొంటారు.
G. Kishan Reddy
Yadadri Temple
Secunderabad

More Telugu News