MS Dhoni: ఐపీఎల్ కొత్త యాడ్ లో ధోనీ హంగామా... వీడియో ఇదిగో!

Dhoni entertains in new IPL ad

  • భారత్ లో నిలిచిన ఐపీఎల్-14
  • యూఏఈలో కొనసాగింపు
  • సెప్టెంబరు 19 నుంచి రీస్టార్ట్
  • ప్రచార వీడియో పంచుకున్న స్టార్ స్పోర్ట్స్

కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ ఆసక్తికర ప్రచార వీడియోను పంచుకుంది.

ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ వెరైటీ గెటప్పుతో దర్శనమిచ్చాడు. జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో హుషారుగా గెంతుతూ వినోదం పండించాడు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తోందని, తుపానులా ఉంటుందని ధోనీ పేర్కొనడం ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్టాఫ్ ను మించిన థ్రిల్ ఖాయమని, క్లైమాక్స్ అదిరిపోతుందని ఓ సినిమా లెవల్లో పబ్లిసిటీ ఇచ్చాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News