Nagarjuna: 'బంగార్రాజు' షూటింగ్ ప్రారంభం!

Bangarraju shooting started

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • నాగ్ సరసన రమ్యకృష్ణ 
  • చైతూ జోడీగా కృతి శెట్టి 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన

'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా సంచలన విజయాన్ని సాధించిన దగ్గర నుంచి, 'బంగార్రాజు' సినిమా గురించిన ప్రస్తావన వస్తూనే ఉంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన ఆ పాత్ర పేరుతోనే ఒక సినిమా చేయాలనుకున్నారు.

అయితే ఆ టైటిల్ కి తగిన కథను తయారు చేసుకుని నాగార్జునను ఒప్పించడానికి కల్యాణ్ కృష్ణ చాలా సమయమే తీసుకున్నాడు. ఆ తరువాత మరికొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాకి ముహూర్తం కుదిరింది. ఈ రోజున హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక నాగచైతన్య ఒక కీలకమైన పాత్రను పోషించనుండగా, ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 'సంక్రాంతి' బరిలోనే ఈ సినిమాను దింపాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.    

Nagarjuna
Ramya Krishna
Chaitu
Kruthi Shetty
  • Loading...

More Telugu News