Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rakul will join Hindi film shoot next week

  • హిందీ సినిమా షూటింగులో రకుల్ 
  • మెగాస్టార్ కు కథ చెప్పిన మారుతి
  • నవీన్ పోలిశెట్టి చేతిలో మరో ప్రాజక్టు

*  తెలుగులో హిట్టయిన 'రాక్షసుడు' చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఇక ఈ చిత్రం షూటింగులో రకుల్ వచ్చే వారం నుంచి పాల్గొంటుంది. ఒక నెల రోజుల్లో ఈ చిత్రం షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
*  ప్రస్తుతం 'ఆచార్య' చిత్రాన్ని పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తదుపరి 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తారు. ఆ తర్వాత 'వేదాళం' రీమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఇక తాజాగా దర్శకుడు మారుతి మెగాస్టార్ కు ఓ కథ చెప్పాడనీ, అది చిరంజీవికి నచ్చిందని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తయారుచేసుకుని రమ్మని ఆయన చెప్పినట్టు సమాచారం.
*  'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే చిత్రంలో నవీన్ హీరోగా నటిస్తాడు. మరోపక్క, ఇప్పటికే 'జాతిరత్నాలు' సీక్వెల్ లోను, అనుష్క సరసన మరో చిత్రంలోనూ నవీన్ నటిస్తున్నాడు.

Rakul Preet Singh
Chiranjeevi
Maruti
Naveen Polishetty
  • Loading...

More Telugu News