Afghanistan: ఆఫ్ఘన్ పౌరుల కష్టాలను వ్యాపారంగా మార్చుకున్న పాక్ వాసులు.. మానవ స్మగ్లింగ్‌లో బిజీబిజీ!

pakistan human smugglers are benefiting in the midst of the afghancrisis

  • ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు వద్ద మానవ స్మగ్లింగ్
  • బాధిత ఆఫ్ఘనీలను సరిహద్దు దాటించేందుకు డబ్బులు వసూలు
  • సరిహద్దు వద్ద వాహనాల బారులు

ఒకరి కష్టం మరొకరికి వరంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతికి చిక్కడంతో ప్రజలు తమ మానప్రాణాలను కాపాడుకునేందుకు దేశం విడిచిపారిపోతున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్ వాసులు వారి అవసరాన్ని తమకు అనువుగా మార్చుకుని జేబులు నింపుకుంటున్నారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో ఉన్నవారు ఇప్పుడీ వ్యాపారంలో బిజీగా ఉన్నారు. బాధిత ఆఫ్ఘనీలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటూ డబ్బులు తీసుకుని తమ వాహనంలో క్వెట్టా, కరాచీ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

దీంతో పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల వద్ద వాహనాల బారులు కనిపిస్తున్నాయి. బాధితులను తరలించే సమయంలో భద్రతా దళాల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఇది మానవ అక్రమ రవాణాయేనని అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యాపారం చేస్తున్న హమీద్ గుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ వ్యాపారం బాగుందని, వారం రోజుల్లో వేయిమందిని సరిహద్దు నుంచి తరలించానని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News