PCB: పాకిస్థాన్, ఆఫ్ఘన్ జట్ల వన్డే సిరీస్ కు తాలిబన్లు ఆమోదం తెలిపారా?... అవునంటున్న పీసీబీ
- ఛాందసవాదులుగా తాలిబన్లకు గుర్తింపు
- క్రికెట్ ను వ్యతిరేకిస్తారని ప్రచారం
- వచ్చే నెలలో శ్రీలంకలో పాక్, ఆఫ్ఘన్ వన్డే సిరీస్
- సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు 3 వన్డేలు
తాలిబన్లు ఆధునిక మానవ వికాసానికి బద్ధ వ్యతిరేకులని అందరికీ తెలుసు. నవీన పోకడలు, కొన్ని రకాల క్రీడలకు తాలిబన్ల నిఘంటువులో చోటులేదు. అయితే, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కు తాలిబన్లు ఆమోదం తెలిపినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చెబుతోంది. తాలిబన్ల భావజాలం గురించి తెలిసిన వాళ్లకు పీసీబీ ప్రకటన నమ్మశక్యం కావడం లేదు.
పాకిస్థాన్, ఆఫ్ఘన్ జట్ల మధ్య తటస్థ వేదిక శ్రీలంకలో వచ్చే నెలలో వన్డే సిరీస్ సెప్టెంబరు 1 నుంచి 5 వరకు జరగాల్సి ఉంది. ఆఫ్ఘన్ అధికార పగ్గాలు తాలిబన్లు చేజిక్కించుకోవడంతో ఈ సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తాలిబన్లు ఈ సిరీస్ కు సమ్మతించారంటూ పీసీబీ వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.