G. Kishan Reddy: శ్రీవారి సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు

union minister kishan reddy visits tirumala

  • వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారి దర్శనం
  • తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు
  • కరోనా పరిస్థితులు చక్కబడాలని స్వామి వారిని కోరానన్న కిషన్‌రెడ్డి

తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఈ ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

దర్శనానంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

G. Kishan Reddy
K Narayana Swamy
TTD
Tirumala
  • Loading...

More Telugu News