Dasari Arun Kumar: తనపై కేసు నమోదవడంపై దాసరి అరుణ్‌ కుమార్ స్పందన

Dont know who is Narsimhulu says Dasari Arun
  • దాసరి అరుణ్ పై పోలీస్ కేసు నమోదు
  • కులం పేరుతో దూషించారంటూ నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు
  • తెలియని వ్యక్తికి డబ్బులు ఎలా ఇవ్వాలన్న అరుణ్
దర్శకరత్న, దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించారంటూ అరుణ్ పై నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్ పై ఐపీసీ 504, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ వార్తలపై దాసరి అరుణ్ స్పందించారు.
 
అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పారు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసి అడిగారని... ఆయన ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారని తెలిపారు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్ లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని అన్నారు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని చెప్పారు. నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని తెలిపారు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదని చెప్పారు. ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించారు. 
Dasari Arun Kumar
Police Case
Dasari Narayana Rao

More Telugu News