Regina: మిస్టరీ థ్రిల్లర్ 'నేనే నా?' నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!
![Intresting poster from Nena Na movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20210818tn611cff3441f03.jpg)
- రెజీనా ప్రధాన పాత్రధారిగా 'నేనే నా?'
- ఓ మర్డర్ చుట్టూ తిరిగే కథ
- కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్
- త్వరలోనే ట్రైలర్ రిలీజ్
తెలుగు తెరపై రెజీనా కథానాయికగా కొంతకాలం పాటు తన దూకుడును కొనసాగించింది. అలా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత కొత్త కథానాయికల కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నాయిక ప్రధానమైన కథలకు గ్రీన్ ఇగ్నల్ ఇస్తూ వెళుతోంది.
అలా ఇంతకుముందు ఆమె చేసిన 'ఎవరు' సినిమా హిట్ కొట్టేసింది. ఆ తరువాత ఈ తరహా కథలనే ఆమె సెట్స్ పైకి తీసుకెళ్లింది. అలాంటి సినిమాలలో ఒకటిగా 'నేనే నా' కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పూడ్చి పెట్టబడిన ఒక అస్థిపంజరాన్ని బయటికి తీసి, పరిశీలిస్తూ రెజీనా ఈ పోస్టర్లో కనిపిస్తోంది.
![](https://img.ap7am.com/froala-uploads/20210818fr611d002401dc1.jpg)