sp: తాలిబన్లను భారత స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌తో పోల్చిన యూపీ ఎంపీ స‌హా ముగ్గురిపై దేశద్రోహం కేసు

sedition case against sp leader

  • సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ వ్యాఖ్య‌లపై ఫిర్యాదు
  • ఆఫ్ఘ‌న్‌ స్వేచ్ఛగా ఉండాల‌ని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్య‌
  • తాలిబ‌న్లు దేశాన్ని నడపాలనుకుంటున్నారన్న ఎంపీ
  • మ‌రో ఇద్ద‌రు కూడా తాలిబ‌న్ల‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు 

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఎన్నో దాడుల‌కు పాల్ప‌డి వేలాది మంది ప్రాణాలు తీసి చివ‌ర‌కు ఆ దేశంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి సిద్ధ‌మైన తాలిబ‌న్ల‌ను భార‌త స్వాతంత్య్ర‌ సమర యోధులతో పోల్చిన ఆరోప‌ణ‌ల‌పై ఓ ఎంపీ స‌హా ముగ్గురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాలిబ‌న్లు చేసిన పోరాటాన్ని భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చుతూ ఇటీవ‌ల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ వ్యాఖ్య‌లు చేశారు.

అమెరికా, ర‌ష్యా త‌మ దేశం విష‌యంలో జోక్యం చేసుకోకుండా ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్లు నిరోధించార‌ని పొగిడారు. ఆఫ్ఘ‌న్‌ స్వేచ్ఛగా వుండాలని, తాలిబ‌న్లు దేశాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నానని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, మ‌రో ఇద్ద‌రు కూడా తాలిబ‌న్ల‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేశారు.

శాంతియుతంగా జరిగిన భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో ఉగ్ర‌వాదుల చ‌ర్య‌ల‌ను పోల్చ‌డ‌మేంట‌ని ప‌లువురు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేశామ‌ని చంబల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చార్ఖేష్ మిశ్రా చెప్పారు. తాలిబన్లను భారత స్వాతంత్య్ర సమర యోధులతో పోల్చడ‌మే కాకుండా, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు విజ‌యం సాధించారంటూ సంబరాలు చేసుకుకున్నార‌ని ఆయన తెలిపారు.

భారత స‌ర్కారు ప్రకారం తాలిబన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఆయ‌న గుర్తు చేశారు. తాలిబన్లపై చేసిన ఇటువంటి వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చని తెలిపారు. ఈ కార‌ణంగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామ‌ని చెప్పారు. మరోపక్క, స‌మాజ్ వాదీ పార్టీ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలలానే షఫీఖర్ బార్క్ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News