bandla ganesh: ట్విట్ట‌ర్‌లో మీ అందరి ముందుకి మళ్లీ వస్తున్నాను: బండ్ల గ‌ణేశ్

bandla ganesh enters twitter again

  • ట్విట్టర్ నుంచి వైదొలగుతున్నట్టు ఇటీవ‌ల‌ ప్రకటన‌
  • నిర్ణ‌యాన్ని మార్చుకున్న బండ్ల గ‌ణేశ్
  • 'జర్నలిస్ట్ డైరీ' సతీశ్‌ బాబు స‌ల‌హాతో ట్విట్ట‌ర్‌లో కొన‌సాగింపు

సినీ నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ నుంచి వైదొలగుతున్నట్టు ఇటీవ‌ల‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే. త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తానని, తన జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని కోరుకుంటున్నాన‌ని ఇటీవ‌లే ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే, ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ఓ జ‌ర్న‌లిస్టు సూచ‌న మేర‌కు ట్విట్ట‌ర్‌లో కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించారు.

'పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీశ్‌ బాబు గారు ఈ రోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం, వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందుకి మళ్లీ వస్తున్నాను' అని బండ్ల గ‌ణేశ్ ట్వీట్ చేశారు. కాగా, న‌టుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గ‌ణేశ్ ప్ర‌స్తుతం నిర్మాత‌గానూ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

bandla ganesh
Twitter
Tollywood
  • Loading...

More Telugu News