coronavirus: డెల్టా వేగంగా వ్యాపిస్తోంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Delta variant Danger World Health Organization Concern

  • నాలుగు వేరియంట్లు ప్రమాదకరంగా వున్నాయి 
  • వాటిలో వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్ డెల్టా 
  • పలుదేశాల్లో ఆక్సిజన్ అత్యవసరం
  • 7.7 బిలియన్ల పథకానికి ఆమోదం కోరిన డబ్ల్యూహెచ్‌వో

భారతదేశంలో తొలిగా వెలుగుచూసిన కరోనా డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ చాలా వేగంగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.

ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు వేరియంట్లు ప్రమాదకరంగా ఉండగా, అతి త్వరలో డెల్టా వేరియంట్ ఈ జాబితాలో తొలిస్థానానికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. డెల్టా కేసులు పెరగడం వల్ల పలు దేశాల్లో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయని చెప్పింది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో పరిస్థితులు అంత బాగాలేవని తెలిపింది. ఈ వేరియంట్‌ను నియంత్రించడం కోసమైనా ప్రపంచంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

ఇదే క్రమంలో 7.7 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ర్యాపిడ్ ఏసీటీ-ఆక్సిలరేటర్ డెల్టా రెస్పాన్స్ (రాడార్)గా పిలిచే ఈ పథకాన్ని వచ్చే నాలుగు నెలల్లో ఆమోదించాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. ఈ ఆమోదం లభిస్తే కరోనా టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని కొత్త వేరియంట్లను ముందుగానే గుర్తించవచ్చని ఈ సంస్థ పేర్కొంది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మరింత ఆక్సిజన్ అందించవచ్చని, ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం కుదురుతుందని తెలిపింది. ఈ రాడార్ పథకం కొత్తదేమీ కాదని, ఏసీటీ-ఆక్సిలరేటర్‌కు ప్రతిపాదించిన మొత్తం 2021 బడ్జెట్‌లో భాగమని చెప్పింది. 2020 మొత్తంలో నమోదైన కరోనా కేసుల కన్నా 2021 తొలి 5 నెలల్లోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు కరోనా వేరియంట్లు ప్రబలుతున్నాయని, అయితే వీటికన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు ఇంకా పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News