Pavan Kalyan: 'వీరమల్లు' నుంచి నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్

- 'వీరమల్లు'లో పవన్ సరసన నాయిక
- షూటింగు దశలో సినిమా
- సంక్రాంతికి విడుదల
- అశోక్ గల్లా జోడీగా 'హీరో'
- దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన గ్లామరస్ కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరుగా కనిపిస్తుంది. తొలి రెండు సినిమాలు పరాజయం పాలైనా, మూడవ సినిమా అయిన 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ను అందుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో, పవన్ కల్యాణ్ సరసన నాయికగా 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది.
ఈ రోజున తన పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'పంచమి' అనే పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ వదిలిన లుక్ ఆకట్టుకుంటోంది. ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, 'సంక్రాంతి' కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

