Tokyo Paralympics: పారాలింపిక్స్ బృందానికి మోదీ ప్రోత్సాహం

PM Modi interacts with Indian contingent for Paralympics

  • ఈ నెల 24 నుంచి క్రీడా వేడుక ప్రారంభం
  • వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడాకారులతో ముచ్చట
  • పాల్గొన్న క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

టోక్యో ఒలింపిక్స్ విజయాలను పూర్తిగా మరువక ముందే మరో క్రీడా వేడుకకు రంగం సిద్ధమైంది. అదే పారాలింపిక్స్. ఈసారి భారత్ తరఫున భారీ బృందం ఈ క్రీడల్లో పోటీ పడనుంది. మొత్తం 54 మంది క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయమంత్రి కిరణ్ రిజిజు.. ఈ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వాళ్లందరికీ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా క్రీడాకారుల జీవితాలను గురించి తెలుసుకున్న ప్రధాని, వారందరినీ ప్రోత్సహించారు. ఈ క్రీడాకారుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిదాయకం అవుతాయని అన్నారు. ‘‘పతకాల కోసం క్రీడాకారులపై నవభారత్ ఎటువంటి ఒత్తిడీ పెట్టదు. మీరు పూర్తిగా 100% కష్టపడితే చాలు’’ అని మోదీ చెప్పారు. పారాలింపిక్స్ క్రీడలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News