paritala sriram: స్వాతంత్య్ర దినోత్సవం నాడే నడిరోడ్డుపై దళిత ఆడ కూతురిని పొడిచి చంపడం దారుణం: పరిటాల శ్రీరామ్
- అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం
- మహాత్మా గాంధీ గారు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు
- ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి?
- ప్రభుత్వానికి ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ చట్టాన్ని అమలు చేయడంలో లేదు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు.
'అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం' అని ఆయన అన్నారు.
'ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఈ దిశ చట్టాలు, యాప్ లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?' అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.