Single Use Plastic: వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం
- కేంద్రం పర్యావరణ పరిరక్షణ చర్యలు
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కీలక నిర్ణయం
- తయారీ, విక్రయం, వాడకంపై నిషేధం
- పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనిపై తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకం అంశాలు నిషేధం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.