Raja Singh: ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్ పెట్టారు: కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్

Raja Singh fires on KCR

  • ప్రజల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం తాగుతోంది
  • ఎమ్మెల్యేలను పశువులను కొంటున్నట్టు కొంటున్నారు
  • నీటిని ఏపీ తీసుకెళ్తుంటే ఆపే దమ్ము కేసీఆర్ కు లేదు

హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ డబ్బు గెలుస్తుందో లేక ఈటల రాజేందర్ గెలుస్తాడో ప్రజలు నిర్ణయిస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర పేరును 'ప్రజా సంగ్రామ యాత్ర'గా రాజాసింగ్ ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం తాగుతోందని అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు.

తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్ ను కేసీఆర్ పెట్టారని రాజాసింగ్ విమర్శించారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్తుంటే ఆపే దమ్ము కూడా కేసీఆర్ కు లేదని చెప్పారు. కమిషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారని రాజాసింగ్ అన్నారు. 

Raja Singh
BJP
KCR
TRS
  • Loading...

More Telugu News