Philippines: భారత ప్రయాణికులపై నిషేధం విధించిన ఫిలిప్పీన్స్
- ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు
- 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించిన ఫిలిప్పీన్స్
- ఈ నెల 31 వరకు ఆంక్షలు
కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అనేక దేశాల్లో ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసులలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ఇతర దేశాల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఆంక్షలను పొడిగించాయి.
తాజాగా ఫిలిప్పీన్స్ కూడా 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ నెల 31 వరకు ఈ 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఫిలిప్పీన్స్ తెలిపింది. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఆంక్షలను విధించింది. అప్పటి నుంచి ఆంక్షలను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ఫిలిప్పీన్స్ ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, మలేసియా, ఒమన్, యూఏఈ, థాయిలాండ్ ఉన్నాయి.