Whatsapp: ‘వెలుగు’ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో.. క్షమాపణలు చెప్పిన ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం

 objectionable Video posted in SHG whatsapp Group
  • ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం ఖాతా నుంచి వీడియో పోస్టు
  • వీడియో చూసి మహిళలు షాక్
  • అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చిన ఏపీఎం
‘వెలుగు’ వాట్సాప్ గ్రూపులో ఓ అభ్యంతరకర వీడియో కలకలం రేపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో ఓ ‘నీలి’ వీడియో పోస్టు అయింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రూపులోని మహిళలు ఆ వీడియో చూసి షాకయ్యారు. అది కూడా ఈ వీడియోను 'వెలుగు' ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం పోస్టు చేయడం మరింత చర్చకు దారితీసింది.

 వీడియో పోస్టు కావడంపై బాలసుబ్రహ్మణ్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున అందులో పోస్టు అయినట్టు చెప్పారు. ఈ విషయంలో తన తప్పు లేదని, అయినప్పటికీ కొందరు కావాలని తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు వీడియోను ఇతరులకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో పోస్టు అయినందుకు గ్రూపు సభ్యలుకు నేరుగా క్షమాపణలు చెప్పానని వివరించారు.
Whatsapp
Andhra Pradesh
Self Help Groups
objectionable Video

More Telugu News